పిల్లలను కనాలనుకుంటున్నాం.. కానీ ఓ సందేహం..

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-10-14 15:41:48.0  )
పిల్లలను కనాలనుకుంటున్నాం.. కానీ ఓ సందేహం..
X

మా పెళ్లై రెండేళ్లు అవుతోంది. ఇప్పటివరకూ ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాం. ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటున్నాం. అయితే ఓ సందేహం. నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. మా వారిది బి నెగటివ్. దీనివల్ల మా పిల్లలమీద ఏదైనా చెడు ప్రభావం ఉంటుందా?

కటే బ్లడ్ గ్రూప్ అవటం వలన పెద్దగా సమస్య రాదు. అయితే మీ బ్లడ్ గ్రూప్ ఆర్‌హెచ్ నెగటివ్ ఉంటేనే సమస్య వస్తుంది. అలాగే రెండోసారి గర్భం ధరిస్తే, ఆ బిడ్డ విషయంలో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మీ భార్యాభర్తలిద్దరూ మంచి గైనకాలజిస్టును కలిసి గర్భధారణకు ప్లాన్ చేసుకోండి. అలాగే మీ బ్లడ్ గ్రూప్స్‌కు సంబంధించి ఓసారి డాక్టర్‌తో చర్చించండి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్


Read More..

పెళ్లి చేసుకునే అర్హత నాకు ఉందా..? అమ్మాయి జీవితం పాడు చేస్తానేమో!

Advertisement

Next Story