- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాచకొండలో సెక్స్ ట్రాఫికింగ్.. 115 వేశ్య గృహాలు సీజ్
దిశ, క్రైమ్ బ్యూరో: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్స్ ట్రాఫికింగ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాచకొండ పోలీసులు, ఎస్ఓటీ, యాంటీ హుమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పలు సందర్భాల్లో జరిపిన దాడుల్లో వందలాది మంది బాధితులను రెస్క్యూ చేసి, ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి రాచకొండ కమిషనరేట్ ప్రత్యేకంగా ఏర్పాటు తర్వాత నగర శివారు ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, భవనగిరి, చౌటుప్పల్ తదితర ప్రాంతాలతో రాచకొండ కమిషనరేట్‌ను 2016లో ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి నేటివరకూ ఈ ఆరేండ్ల కాలంలో మానవ అక్రమ రవాణకు పాల్పడుతున్న వ్యక్తులపై దాదాపు 300 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా రాచకొండ పరిధిలోకి యాదగిరిగుట్ట రావడంతో ఈ తరహా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు పోలీసు అధికారులు భావిస్తున్నారు.
115 వేశ్య గృహాలు సీజ్..
యాదగిరిగుట్టలో మైనర్ బాలికలు, యువతులను ఇతర ప్రాంతాల నుంచి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు షీ టీమ్స్‌తో పాటు యాదగిరిగుట్ట పోలీసులు పలు ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 34 మైనర్ బాలికలతో పాటు 12 మంది యువతులను పోలీసులు కాపాడగలిగారు. వీరంతా ఇతర ప్రాంతాలను యాదగిరిగుట్టకు తరలిస్తూ.. వ్యభిచారం చేయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వీరందర్నీ ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ హోం, ప్రభుత్వ శిశు గృహాకు తరలించారు. ఈ సందర్భంగా సెక్స్ ట్రాఫికింగ్ నిర్వహిస్తున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. 2016 నుంచి 2020 వరకూ ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలు, యువతులను తరలించి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న 115 ఇళ్లను రాచకొండ పోలీసులు సీజ్ చేశారు. వీటిలో 2016లో 24, 2017లో 14, 2018లో 38, 2019లో 24, 2020లో 15 ఇళ్లను సీజ్ చేశారు.
ఆరేళ్లల్లో 300 కేసులు నమోదు..
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2020 జూలై నెలలో యాంటీ హుమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఏర్పడినప్పటికీ, కమిషనరేట్ ఏర్పాటైన 2016 నుంచి ఎస్ఓటీ పోలీసుల ఆధ్వర్యంలో పలు మార్లు హుమన్ ట్రాఫికింగ్ జరుపుతున్న గృహాలు, పరిశ్రమలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇప్పటివరకూ మానవ అక్రమ రవాణా సంబంధిత కేసులను 300 వరకూ రాచకొండ పోలీసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మొత్తం 599 బాధితులను రక్షించారు. వీరిలో 462 మంది మేజర్లు ఉండగా, 137 మంది మైనర్లు ఉన్నారు. ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న 564 మందిని అరెస్టు చేశారు. దీంతో సుమారు 76 మందిపై పీడీ ప్రయోగించి, జైలుకు పంపారు. వీటిలో 2018లో 35, 2019లో 12, 2020లో 15 ఉన్నాయి. అంతేగాకుండా, ప్రతియేటా నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2017 నుంచి 2021 వరకూ వివిధ దాడుల్లో మొత్తం 2369 పిల్లలను పోలీసులు కాపాడగా, అందులో 1853 మంది బాలురు కాగా, 516 మంది బాలికలు ఉన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 1127 మంది ఉండగా, వీరిలో 219 మంది బాలికలు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మొత్తం 1242 మంది ఉండగా, అందులో 297 మంది బాలికలు ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ లో యాంటీ హుమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఏర్పాటు చేసిన 2020 జూలై నుంచి ఇప్పటి వరకూ 29 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా 18 సెక్స్ ట్రాఫికింగ్ కేసులే నమోదు కావడం గమనార్హం. ఈ కేసులో 76 మందిని అరెస్టు చేయగా, 109 మందిని పోలీసులు కాపాడారు. భవిష్యత్తులో ఈ తరహా కేసులపై రాచకొండ పోలీసులు మరింత ప్రధానమైన కేసులుగా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించనున్నారు.