ఇక్కడ మల, మూత్ర విసర్జన చేయలేం

by Anukaran |   ( Updated:2020-08-21 21:00:37.0  )
ఇక్కడ మల, మూత్ర విసర్జన చేయలేం
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: పట్టణాల్లో మల, మూత్ర విసర్జన కష్టతరంగా మారింది. ఇంటికి వెళ్లే వరకు ఉగ్గబట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక విద్యార్థులు, మహిళల పరిస్థితి మరీ దారుణం. ఈ క్రమంలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంపై సర్కారు దృష్టిసారించింది. ఇందులో భాగంగానే పబ్లిక్​టాయిలెట్ల నిర్మాణం చేపట్టింది. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణాలుగా తీర్చిదిద్దడానికి పూనుకుంది. వెయ్యి మందికి ఒక టాయిలెట్​ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా 562 పబ్లిక్​ టాయిలెట్లు అవసరమవుతాయని అధికార యంత్రాంగం గుర్తించింది. 160 యూనిట్లు అందుబాటులో ఉండడంతో నూతనంగా 402 టాయిలెట్లు నిర్మిస్తోంది. ఆగస్టు 15 లోపు నిర్మాణాలు పూర్తికావాల్సి ఉండగా నత్తనడకన పనులు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరు లోపు పనులు పూర్తికావాలని కలెక్టర్​అమయ్ కుమార్​ డైడ్​లైన్​ విధించారు.

పట్టణ ప్రాంతాల్లో బహిరంగ మల, మూత్ర విసర్జనకు చేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీను ఆదేశించింది. అందులో భాగంగానే జనాభా ప్రాతిపదికన పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయా లని సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో పబ్లిక్ టాయిలెట్లను నిర్మిస్తోంది. మొదట ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినప్పటికీ వివిధ కారణాలతో ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక వేళ పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసకుంటామని కలెక్టర్ అమయ్ కుమార్ హెచ్చరించారు. ప్రతీ పట్టణంలో వచ్చే నెల మొదటి వారంలో పబ్లిక్ టాయిలెట్లు వినియోగంలోకి రావాలని సూచించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రతీ వెయ్యి మంది జనాభాకు ఒకటి చొప్పున మరుగుదొడ్డి నిర్మిస్తున్నారు.

జిల్లాలోని 15 పట్టణాల్లో 562 పబ్లిక్ టాయి లెట్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆయా పట్టణాల్లో 160 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 402 నిర్మా ణాల కోసం కలెక్టర్ అమయ్​కుమార్ పాలనా పరమైన అనుమతులు జారీ చేశారు. వీటి నిర్మాణం వివిధ స్థాయిల్లో ఉంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నీ పరిశుభ్ర, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణాలుగా (ఓడీఎఫ్) మార్చేం దుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిన విష యం తెలిసిందే. వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే వారికి ఇబ్బంది కల్గకుండా వీటిని నిర్మిస్తున్నారు. పురుషులకు, మహిళలకు 50శాతం చొప్పున వీటిని కేటాయించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాటికి నిర్మా ణాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ, ఇటీవల కురుస్తున్న వర్షాలకు పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని సూచించారు. ఈ పనులను అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యవేక్షిస్తున్నారు.

కొన్ని పట్టణాల్లో టాయిలెట్లు లేవు..

రంగారెడ్డి జిల్లాలో 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో మూడు కార్పొరేషన్లు కొత్తగా ఏర్పడ్డా యి. మీర్​పేట్, బడంగ్​పేట్​ కార్పొరేషన్లు గతంలో మున్సిపాలిటీలుకాగా, బండ్లగూడ కార్పొరేషన్ గ్రామ పంచాయతీ నుంచి ఏర్పడింది. మున్సిపాలిటీల్లో పబ్లిక్ టాయిలెట్లు ఉండేవి. కానీ, కొత్తగా ఏర్పడిన బండ్లగూడ కార్పొరేషన్​ పరిధిలో టాయిలెట్లు లేవు. అలాగే, 12 మున్సిపాలిటీల్లో రెండు మాత్రమే కొత్తవి. మిగిలిన 12 నగర పంచాయతీలు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఆవిర్భవించాయి. ఇందులో తాత్కాలికంగా నిర్మించిన మరుగుదొడ్లే ఉన్నాయి. మౌలిక వసతులు అంతంత మాత్రమే. నార్సింగి పట్టణంలోఒక్క మరుగుదొడ్డి లేకపోవడం దారుణం. పెరుగుతున్న శివార్లలో నార్సింగి పట్టణం ఒకటి. నిత్యం జనసంచారం ఉన్న ప్రాంతంలో ఒక్క మరుగుదొడ్డి లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed