- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడు సార్లు పాజిటివ్.. కానీ, లక్షణాలు నిల్
న్యూఢిల్లీ: కరోనా పేరు వింటేనే జనాలు వణికిపోతున్నారు. ఏ కాస్త జలుబు, దగ్గు ఉన్నా అనుమానంగా చూస్తున్నారు. వైరస్ సోకిన 14 రోజుల తర్వాత గానీ లక్షణాలు బయట పడకపోవడంతో ఈ భయాలు నెలకొన్నాయి. అదీగాక, కొందరిలో లక్షణాలు 28 రోజుల వరకూ బయటపడవని చెప్పడంతో ఈ ఆందోళనలు మరింత పెరిగాయి. వీటికి తోడు కొందరిలో కరోనా పాజిటివ్‌గా పలుసార్లు తేలినప్పటికీ వైరస్ లక్షణాలు వ్యక్తం కావడం లేదు. వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయినప్పటికీ బాడీలో ఎటువంటి తేడా కనిపించడం లేదని వారంటున్నారు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన 19 ఏళ్ల యువకుడికి ఏడుసార్ల కరోనా పాజిటివ్ తేలింది. అయినప్పటికీ తన దేహంలో ఇసుమంతైనా అలసట లేదని, దగ్గు, కనీసం తలనొప్పి కూడా లేదని అతడు చెప్పాడు.
వడోదరలోని నాగర్వాడాకు చెందిన జై పాట్ని, అతని తల్లిదండ్రులు గతనెల 12న కరోనా టెస్టులు జరిపించుకున్నారు. ఈ పరీక్షల్లో ముగ్గురికీ కరోనా పాజిటివ్ వచ్చింది. అందరినీ ఐసొలేషన్‌లో ఉంచారు. 13 రోజుల తర్వాత పాట్ని తల్లిదండ్రులు వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా టెస్టులో నెగెటివ్ రావడంతో వారిని ఇంటికి పంపించారు. కానీ, పాట్నికి మాత్రం కరోనా పాజిటివ్‌గానే ఉన్నది. ఇప్పటికి ఏడుసార్లు కరోనా టెస్టులు జరపగా.. అన్నింటిలోనూ పాజిటివ్ అనే వచ్చింది. తనకే ఎందుకిలా రిపీటెడ్‌గా పాజిటివ్ వస్తున్నదో ఇప్పటి వరకు ఏ వైద్యుడూ వివరించట్లేదని పాట్ని అంటున్నాడు. లక్షణాలు బయటపడనివారిని, పాక్షిక లక్షణాలున్నవారిని పది రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి ఇంటికి పంపే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. అయితే, ఈ అవకాశాన్నీ పాట్ని స్వీకరించదలుచుకోలేదు. ఇంటికెళ్లి మళ్లీ పేరెంట్స్‌కు వైరస్ అంటించడమెందుకు? రెండు సార్లు వరుసగా నెగెటివ్ వచ్చే వరకు ఇంటికెళ్లేది లేదని తెగేసి చెబుతున్నాడు. ఇప్పుడు పాట్నికి ఎనిమిదో సారి టెస్టు నిర్వహించారు. ఫలితాలు రావలసి ఉన్నది. ఇప్పుడు నెగెటివ్ వస్తే.. ఇంటికి ఓ అడుగు చేరువైనట్టే. మరొక విషయమేంటంటే.. పాట్ని చదువుతున్న హై స్పీడ్ రైల్వే ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పదుల సంఖ్యలో మందికి ఈ వైరస్ సోకింది. ఇందులో.. లక్షణాలు లేనివారిని, స్వల్పంగా లక్షణాలు కనిపించినవారినీ క్వారంటైన్‌లోకి పంపడంతో.. కరోనా కేసులు రెట్టింపవడం గమనార్హం.