Pan Card 2.0 : పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ షురూ!

by M.Rajitha |
Pan Card 2.0 : పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ షురూ!
X

దిశ, వెబ్ డెస్క్ : పాన్ కార్డ్ 2.0(Pan Card 2.0) ప్రాజెక్ట్ మొదలైంది. సైబర్ మోసల(Cyber Crimes) బారిన పడుకుండా ఉండేందుకు ఈ కార్డు కీలక పాత్ర పోషించనుంది. పాన్ కార్డ్ 2.0 కేంద్ర ఆదాయపుపన్ను శాఖచే ప్రవేశపెట్టబడిన ఒక ఆధునికీకరణ ప్రాజెక్ట్. ఇది పాన్ కార్డ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, సురక్షితంగా, డిజిటల్‌గా మార్చడానికి రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రిమండలి నవంబర్ 25, 2024న ఆమోదం తెలిపింది, దీని బడ్జెట్ రూ. 1,435 కోట్లు. ఎటిఎం కార్డు మాదిరిగా ఉండే ఇందులో.. డైనమిక్ QR కోడ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, ఇది పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని ఎన్‌క్రిప్టెడ్ రూపంలో భద్రపరుస్తుంది. దీనికి ఆధార్ లింకేజ్(Adhar Linkage) తప్పనిసరి. కొత్త పాన్ కార్డ్ జారీ, పాత కార్డులో సవరణలు పూర్తిగా ఉచితం. అయితే ఫిజికల్ కార్డ్ కోసం నామమాత్ర రుసుము వసూలు చేయబడుతుంది. ఇది వరకే జారీ అయిన పాత కార్డులు కూడా పనిచేస్తాయి కానీ QR కోడ్‌తో కొత్త కార్డ్ కావాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story