- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నష్ట పరిహారం అందించే విధంగా కృషి చేస్తాను : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

దిశ, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలం లోని,లక్ష్మి పూర్ గ్రామంలో,మొన్న కురిసిన అకాల వర్షాలకు, నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం,రైతులతో మాట్లాడుతూ,రైతులు అధైర్య పడవద్దు అని,అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన వెను వెంటనే జిల్లా,మండల స్థాయి వ్యవసాయ అధికారులు,రైతు నాయకులతో మాట్లాడాను అని పంట నష్టాన్ని అంచనా వేయడం జరిగింది అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం అందించే విధంగా కృషి చేస్తానని,లక్ష్మి పూర్ సీడ్ ప్రాసెస్ యూనిట్ అతి త్వరలో పూర్తి అవుతుందని గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో కొంత ఆలస్యం అయిందని ఎమ్మెల్యే అన్నారు,. రైతులు,రైతు కూలీల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు ముస్కు ఎల్లారెడ్డి,గడ్డం నారాయణ రెడ్డి,నక్కల రవీందర్ రెడ్డి,చెరుకు జాన్,బాల ముకుందం,Ao తిరుపతి,AEO హరీష్,రైతులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.