- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బలభద్రపురంలో 37 మందికి క్యాన్సర్ లక్షణాలు

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో ఇప్పటి వరకు 37 మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. ఇంటింటికీ తిరిగి వైద్యులు వివరాలు సేకరిస్తున్నారు. రాజానగరం జీఎస్‌ఎల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సచివాలయం-3 వద్ద ఇవాళ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఇందుకోసం విశాఖకు చెందిన హోమిబాబా క్యాన్సర్ పరిశోధన సంస్థ నిపుణులతో పాటు ప్రభుత్వం నుంచి ఎన్‌సీడీ వైద్యులు కూడా వచ్చారు. గ్రామానికి చెందిన వారిలో గత ఐదేళ్లలో 69 మంది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా క్యాన్సర్ చికిత్స పొందినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి. ప్రస్తుతం 23 మంది చికిత్స తీసుకుంటుండగా 10 మంది దీర్ఘకాల వ్యాధిగ్రస్థులున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ చికిత్స తీసుకున్న వారి సమాచారం సేకరిస్తే వ్యాధి తీవ్రతను అంచనా వేయొచ్చు. రెండు రోజులుగా 2,803 ఇళ్లను సందర్శించి, 8,830 మందిని పరీక్షించినట్టు ఎస్‌పీఎం హెచ్‌వోడీ డాక్టర్ సుజాత తెలిపారు. వ్యాధి తీవ్రతపై స్థానిక వైద్యులకు అవగాహన లేక, వారి వద్దనున్న సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకుని తప్పుడు నివేదికలతో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.