ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిస కావొద్దు : ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

by Aamani |
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిస కావొద్దు : ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
X

దిశ,కౌటాల : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీసులు మీకోసం భాగంగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమ్ యాప్ లకు అలవాటు పడి అప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అక్రమ బెట్టింగ్ యాప్ లలో బెట్టింగ్ కి పాల్పడిన, ఆన్లైన్ గేమింగ్ యాప్ లో గేమ్స్ ఆడిన ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు. బెట్టింగ్ యాప్ లు చాలా ప్రమాదకరమని వీటిలో ఒకసారి చిక్కుకుంటే బయటకు రావడం కష్టమవుతుందని, యాప్ నిర్వాహకుల నుంచి బెదిరింపులు వస్తాయని అన్నారు.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో యువత విద్యార్థులు బెట్టింగ్ యాప్స్ గివింగ్ యాప్స్ కి బానిసలుగా మారి అప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకొని విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారనిఅన్నారు. సోషల్ మీడియాలో వీటిని ప్రోత్సహించడం వల్ల యువతలో దీని వ్యసనం పెరుగుతుందని వీటికి కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని ఎస్పీ అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్ కు పాల్పడిన ఆన్లైన్ గివింగ్ యాప్ లో గేమ్స్ ఆడిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఇటువంటి కార్యకలాపాలపై వెంటనే డయల్ 100కు, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ సబ్ డివిజనల్ ఏ ఎస్పి చిత్తరంజన్, కాగజ్నగర్ డీఎస్పీ రామానుజన్, కౌటాల సీఐ ముత్యం రమేష్, కౌటాల ఎస్సై మధుకర్, ఎస్సైలు నరేష్, ప్రవీణ్, కొమురయ్య, రాజు, సందీప్, మహేందర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story