క్యాంపు రాజకీయం షురూ.. విశాఖ నుంచి వెళ్లిపోతున్న కార్పొరేటర్లు

by srinivas |   ( Updated:2025-03-24 10:40:09.0  )
క్యాంపు రాజకీయం షురూ.. విశాఖ నుంచి వెళ్లిపోతున్న కార్పొరేటర్లు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో క్యాంపు రాజకీయం(Camp Politics) మొదలైంది. మేయర్ కొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నోటీసులతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. ఎలాగైనా సరే మళ్లీ జీవీఎంసీ పీఠాన్ని దక్కించుకోవాలని అడుగులు వేస్తోంది. ఈ మేరకు వ్యూహాలకు పదును పెట్టింది. పట్టు సడలకుండా జీవీఎంసీలోని వైసీపీ కార్పొరేటర్లందరినీ బెంగళూరుకు తరలిస్తోంది. మేయర్‌పై అవిశ్వాసం రోజు మళ్లీ తిరిగి విశాఖకు రానున్నారు.

కాగా విశాఖ మేయర్(Vishaka Mayor) పీఠంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గత ఎన్నికల్లో 98 డివిజన్లలో 59 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి జయకేతనం ఎగరవేశారు. మిగిలిన స్థానాలను టీడీపీ(Tdp), జనసేన(Janasena) పార్టీలు గెలుచుకున్నాయి. అయితే రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత విశాఖలో సీన్ మొత్తం మారిపోయింది. 25 మంది కార్పొరేటర్లు కూటమి పార్టీలవైపు చేరిపోయారు. దీంతో ఎమ్మెల్సీ బొత్స ఆధ్వర్యంలో మిగిలిన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా 34 మంది వైసీపీ కార్పొరేటర్లను బెంగళూరుకు తరలిస్తున్నారు. సోమవారం(ఈ రోజు) కొంతమంది బెంగళూరు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. మరికొందరు మంగళవారం వెళ్లనున్నారు.

ఇప్పటికే విశాఖ మేయర్‌పై అవిశ్వాసం తీర్మానం చేస్తూ కలెక్టర్‌కు కూటమి కార్పొరేటర్లు నోటీసులు అందజేశారు. అవిశ్వాసం తీర్మానం నోటీసులపై సంతకాలు చేసిన కార్పొరేటర్ల వివరాలు జీవీఎంసీ అధికారులు నిర్ధారించుకుంటున్నారు. ఆ తర్వాత బలనిరూపణకు కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులకు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ నోటీసులు జారీ చేసిన 15 రోజుల్లో ఎప్పుడైనా అవిశ్వాసం తీర్మానంపై కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను క్యాంపునకు తరలిస్తున్నారు.

Next Story

Most Viewed