- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటకలో ఏడుగురు మంత్రుల ప్రమాణం
బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా మరో ఏడుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ వాజుభాయివాలా వీరితో ప్రమాణం స్వీకారం చేయించారు. ఎమ్మెల్సీలు ఎంటీబీ నాగరాజు, ఆర్ శంకర్, సీపీ యోగేశ్వర్, సీనియర్ ఎమ్మెల్యేలు మురుగేశ్ నిరాణి, ఉమేశ్ కత్తి, అరవింద్ లింబావళి, అంగారాలు నూతనంగా ప్రమాణస్వీకారం చేసి సీఎం బీఎస్ యెడియూరప్ప క్యాబినెట్‌లో చేరారు. వీరి మంత్రిత్వశాఖలను ఇంకా ఖరారుచేయాల్సి ఉన్నది. మంత్రి హెచ్ నగేశ్ నుంచి ఎక్సైజ్ శాఖ బాధ్యతలను వెనక్కితీసుకోబోతున్నట్టు సంకేతాలనిచ్చారు.
నూతన చేరికలతో రాష్ట్ర క్యాబినెట్‌లో మొత్తం మంత్రుల సంఖ్య 33కు చేరింది. కాంగ్రెస్, జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయాక 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి బీఎస్ యెడియూరప్ప మంత్రివర్గ విస్తరణ చేయడం ఇది మూడోసారి. కాంగ్రెస్, జేడీఎస్ రెబల్స్‌కు ఇచ్చిన హామీని యెడియూరప్ప ఎట్టకేలకు నెరవేర్చారు. కానీ, కొత్త మంత్రుల ఎంపికపై బీజేపీ రాష్ట్ర విభాగంలో పొరపొచ్చాలు వస్తున్నట్టు సమాచారం.