- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, కాళోజీ జంక్షన్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్, పరకాల పోలీసులు సంయుక్తంగా కలిసి ఆదివారం అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యుల నుండి సుమారు 6 లక్షల 40 వేల విలువ గల గంజాయితో పాటు ఒక ట్రాలీ ఆటో, ఒక ద్విచక్రవాహనం, ఏడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బొచ్చు భానుచందర్, వసుల రత్నాకర్, గుర్రాల సుమన్ రెడ్డి, ఉకంటి వీరరెడ్డి, గుగులోత్ హీరు, నకినాల నరేష్, మోతపోతుల రమేష్ గౌడ్ ఉన్నారు. హన్మకొండ గోపాల్‌పూర్ ప్రాంతానికి చెందిన బోచ్చు భానుచందర్ పలుమార్లు స్మగ్లింగ్ కేసులో అరెస్టయినా తీరు మారలేదని తెలిపారు.
జైలు నుంచి వచ్చాక మరో ఆరుగురితో కలిసి మళ్లీ ఇదే దందా మొదలుపెట్టాడని తెలిపారు. ముఠా సభ్యులు విశాఖపట్నం జిల్లా, సీలేరు ప్రాంతం నుండి తక్కువ ధరకు గంజాయి కోనుగోలు చేసిన వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రాంతంలో విక్రయించాలని భావించారని అన్నారు. ఆదివారం వరంగల్‌కు గంజాయికి తీసుకు వస్తున్న క్రమంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముఠాను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మి, పర్కాల, టాస్క్ ఫోర్స్ ఏసీపీలు శివరామయ్య, ప్రతాప్ కుమార్, టాస్క్ ఫోర్స్ సిఐ మధు, పరకాల సిఐ మహేందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, రాజు, రాజేష్, శ్రవణ్, చిరు, హోంగార్డ్ విజయ్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.
- Tags
- ganjaei