- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముత్తయ్య మురళీధరన్‌గా సేతుపతి..
దిశ, వెబ్ డెస్క్: క్రికెట్‌లో శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ గురించి తెలియని వారుండరు. టెస్టుల్లో 800 వికెట్లు తీసిన ఆయన రికార్డ్.. ఓ హిస్టరీ. ఇప్పుడు ఆ చరిత్రనే తెరకెక్కించేందుకు ప్లాన్ చేసింది కోలీవుడ్. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై సినిమా రూపుదిద్దుకోనుండగా.. ఎస్.ఆర్. శ్రీపతి దర్శకుడు. ‘800’ టైటిల్‌తో తెరకెక్కుతున్న బయోపిక్‌లో ముత్తయ్య మురళీధరన్ పాత్రలో కనిపించబోతున్నారు మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేయగా.. మురళీధరన్ ఫ్యాన్స్, సేతుపతి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. లాండ్ మార్క్ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపిన సేతుపతి.. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
Honoured to be a part of this landmark project. Update soon #MuthiahMuralidaran @MovieTrainMP #MuralidaranBiopic #MSSripathy #Vivekrangachari @proyuvraaj pic.twitter.com/lUbJwyiDsy
— VijaySethupathi (@VijaySethuOffl) October 8, 2020
కాగా ఈ సినిమా కోసం ముత్తయ్య మురళీధరన్ దగ్గర సేతుపతి క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కేవలం ఇండియాకు సంబంధించిన క్రికెటర్లు, అథ్లెట్లపై మాత్రమే బయోపిక్ తెరకెక్కగా.. ఇప్పుడు శ్రీలంకకు చెందిన క్రికెటర్ గురించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా తీయడం మొదటిసారని తెలుస్తోంది.
కాగా ఇప్పటికే తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి.. అక్టోబర్ 2న జీ ప్లెక్స్‌లో విడుదలైన ‘కా పే రణసింగం’ చిత్రం ద్వారా సక్సెస్ అందుకున్నాడు. ఇదే చిత్రం తెలుగులో ఈ నెల 9న విడుదల కానుంది.