- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోబోతో లవ్ ట్రాక్.. Big Boss ఉమాదేవి బోల్డ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : యూత్‌కి కావాల్సినంత మసాలా కంటెంట్ ఇవ్వడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంటాడు బిగ్ బాస్. వారి మధ్యల పెట్టే ట్విస్ట్, గొడవలతో కొందరు కంటెస్టెంట్లు ప్రేమలో పడితే.. మరికొందరు శత్రువులుగా తయారై గొడవలు పెట్టుకుంటారు. అయితే సీజన్-5 లో సీనియర్ సీరియల్ నటి ఉమా దేవి, లోబో మధ్య లవ్ ట్రాక్ గురించి అందరికి తెలిసిందే. సీజన్ ప్రారంభంలోనే ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఉమాదేవి ప్రేక్షకులను షాకింగ్‌కి గురి చేసింది. ఇంకా బిగ్ బాస్‌లో లోబోతో ఉన్న రిలేషన్‌షిప్‌ని మర్చిపోలేకపోతున్నానంటూ ఉమాదేవి బోల్డ్ కామెంట్స్ చేసింది.
ఇప్పటికీ బిగ్ బాస్ మూడ్ నుంచి బయటకు రాలేకపోతున్నాని చెప్పొకొచ్చింది. అయితే.. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. ప్రేమిస్తే తప్పేంటి అంటూ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే లోబోతో లవ్ ట్రాక్‌పై ఆమె మాట్లాడుతూ.. అయ్యో ప్రేమకి వయసుతో సంబంధం లేదండీ.. ఏ వయసులో అయినా ప్రేమ పుట్టొచ్చు. దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. పిల్లలే ప్రేమించుకోవాలి అనేది కరెక్ట్ కాదు.. అది వాస్తవం కూడా కాదు.. నేనైతే నా బంగు(లోబో)ని మిస్ అవుతున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. లోబోతో నాకు మంచి బాండింగ్ ఉంది. నేను హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అతన్ని ఒంటర్ని చేస్తారేమో అనే భయం ఉండేదని అన్నారు. నేను జూనియర్ ఆర్టిస్ట్‌గానే వచ్చానని లోబో నాకు చెప్పేవాడు. జూనియర్ ఆర్టిస్ట్ అని చులకన చేయడం నాకు బాధగా అనిపించింది అంటూ ఉమాదేవి చెప్పుకొచ్చింది.