- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ జవాన్ ఎక్కడ పోయినట్టు..?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : బీజాపూర్ ఎన్ కౌంటర్ ఘటనలో కనిపించకుండా పోయిన మరో జవాన్ కోసం బలగాలు ఆరా తీస్తున్నాయి. అతని ఆచూకీ ఇంతవరకు లభ్యం కాకపోవడంతో అన్ని కోణాల్లో ఆరా తీయడం ప్రారంభించారు. కోబ్రా 210లో పనిచేస్తున్న జవాన్ రాకేశ్వర్ సింగ్ మాన్హాస్ కోసం వెతుకుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో పీఎల్ జీఏ బెటాలియన్ నెంబర్ 1కు చెందిన వారు పాల్గొన్నారని తెలుస్తోంది. వీరిపై బలగాలు దాడి చేసినప్పుడు మరణించిన మహిళా మావోయిస్టును గుర్తించారు.
పామెడ్ ఎల్జీఎస్ కమాండర్ మాడ్వి వనోజగా ఆమెను గుర్తించారు. ఆ మృతదేహంతో పాటు ఇన్సాస్ ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం మావోయిస్టులు 12 మంది వరకు చనిపోయి ఉంటారని, మరో 16 మంది గాయపడి ఉంటారని వివరించారు. వీరందరిని నాలుగు ట్రాక్టర్లలో జబ్బమార్కా, గోమ్‌గుడా ప్రాంతానికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది.