- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదే జోరు.. లాభాల్లో మార్కెట్లు
దిశ, వెబ్‌డెస్క్: విదేశీ మార్కెట్ల సంకేతాలతో దేశీయ మార్కెట్లు సోమవారం స్వల్పంగా లాభాలను నమోదు చేశాయి. అనేక దేశాల బాటలో దేశీయంగానూ ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించేందుకు సోమవారం నుంచి అన్‌లాక్ విధానాన్ని అమలు పరిచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఉదయం 600 పాయింట్ల లాభంతో జోరుగా మొదలైన మార్కెట్లు తర్వాత కాస్త నెమ్మదించి చివర్లో స్వల్ప లాభాలను నమోదు చేశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 83.34 పాయింట్ల లాభంతో 34,370 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 25.30 పాయింట్లు లాభపడి 10,167 వద్ద ముగిసింది. గత వారం వరుస ఆరు రోజుల లాభాలకు గురువారం ఒక్కరోజు బ్రేక్ పడినప్పటికీ తిరిగి పుంజుకున్న సూచీలు లాభాలను కొనసాగిస్తున్నాయి. మిడ్‌సెషన్‌లో కొంత ఊగిసలాడినప్పటికీ చివరి గంటలో లాభాలు నమోదయ్యాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ, ప్రైవేట్ రంగ బ్యాంకుల షేర్లు అధిక లాభాలను చూడగా, మీడియా, ఫార్మా కొంత నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, టైటాన్, ఇంఫ్ఫోసిస్ లాభాల్లో కదలాడగా, ఎంఅండ్ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటాస్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.