వదలని నష్టాలు…దిగజారిన మార్కెట్లు!

by Harish |
వదలని నష్టాలు…దిగజారిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ : వరుస నష్టాలతో మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. అంతర్జాతీయంగా కరోనా భయం కొనసాగడం, మదుపర్లలో ఆందోళన తగ్గకపోవడంతో దేశీయ మార్కెట్లపై ప్రభావం తగ్గలేదని విశేషకులు అభిప్రాయపడ్డారు. బుధవారం ఉదయం నుంచే అధిక నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆశిచిన స్థాయిలో రాణించలేకపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 40 వేలకు దిగువకు పడిపోయింది. బుధవారం మార్కెట్ క్లోజయ్యే సమయానికి సెన్సెక్స్ 392.24 పాయింట్లను కోల్పోయి 39,888 వద్ద ముగిసింది. నిఫ్టీ 119.40 పాయింట్లు నష్టపోయి 11,678 వద్ద క్లోజయింది.

మార్కెట్ చివరి గంటలో సెన్సెక్స్ 40,000 దిగువకు పడిపోయింది. నిఫ్టీ సైతం 11,700 కంటే దిగజారింది. అత్యధికంగా సన్‌ఫార్మా 3.67 శాతం క్షీణించింది. మారుతీ, ఎల్‌టీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఐటీసీ 1.50 శాతానికి పైగా నష్టపోయాయి.

ఇండియా బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కార్డుల, చెల్లుంపు సేవల ఐపీవోకు సంబంధించి షేర్ ధరను రూ. 750 నుంచి రూ. 755 మధ్య నిర్ణయించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ బ్యాంక్ సంస్థలో 74 శాతం వాటాను కలిగి ఉంది. ఇది ఐపీఓ తరువాత 69 శాతానికి పడిపోతుంది.ఎస్‌బీఐ కార్డులు మరో వారం రోజుల్లో ఐపీవోకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిందూస్తాన్ యూనిలీవర్ సూచీలు కూడా స్వల్పంగా లాభపడ్డాయి. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 71.62 వద్ద ఉంది.

Advertisement

Next Story