లాభాల బాటలో మార్కెట్లు!

by Harish |   ( Updated:2020-05-21 06:11:45.0  )
లాభాల బాటలో మార్కెట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ మార్కెట్లు ఉదయం నుంచి లాభాల్లో కొనసాగాయి. లంచ్ సమయానికి యూఎస్, యూరప్ మార్కెట్ల ప్రభావంతో 350 పాయింట్లకు పైగా ఎగసినప్పటికీ తర్వాత కొంత తగ్గాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 114.29 పాయింట్లు లాభపడి 30,932 వద్ద ముగియగా, నిఫ్టీ 39.70 పాయింట్ల లాభంతో 9,106 వద్ద ముగిసింది. ముఖ్యంగా నిఫ్టీలో ఆటో, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 2 శాతం ఎగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ 7 శాతం లాభపడగా, ఏషియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, మారుతీ, బజాజ్ ఆటో సన్‌ఫార్మా, టీసీఎస్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఇండస్ఇండ్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

ఎఫ్‌పీఐలు వెనక్కెళ్లాయి…

నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) సుమారు రూ. 1,467 కోట్ల విక్రయాలు జరపగా, దేశీ ఫండ్స్(డీఐఐ) రూ. 2,373 కోట్లను ఇన్వెస్ట్ జరిగాయి. మంగళవారం రోజున ఎఫ్‌పీఐలు రూ. 1,328 కోట్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డీఐఐలు రూ. 1,660 కోట్ల విలువైన స్టాక్స్‌ను కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed