లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు..

by Harish |   ( Updated:2021-07-05 06:11:10.0  )
business news
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు అధిక లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు బ్యాంకింగ్, ఫైనాన్స్, రియాలిటీ రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించడంతో సూచీలు దూసుకెళ్లాయి. ఉదయం నుంచే మెరుగ్గా ర్యాలీ చేసిన స్టాక్ మార్కెట్లు జూన్‌లో ఆర్థిక వృద్ధి బలంగా నమోదవుతుందనే అంచనాలతో మదుపర్లు కొనుగోళ్లను సిద్ధపడ్డారని విశ్లేషకులు తెలిపారు. తయారీ, సేవల పీఎంఐ డీలాపడినప్పటికీ, ఇతర పరిణామాలతో మార్కెట్లు చివరి వరకూ జోరుగానే ట్రేడయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 395.33 పాయింట్లు ఎగసి 52,880 వద్ద ముగియగా, నిఫ్టీ 112.15 పాయింట్లు లాభపడి 15,834 వద్ద ముగిసింది.

నిఫ్టీలో రియాలిటీ రంగం అత్యధికంగా 3 శాతం పుంజుకోగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాలు బలపడ్డాయి. ఐటీ, ఫార్మా రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, టాటా స్టీల్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను సాధించగా, టెక్ మహీంద్రా, డా రెడ్డీస్, హెచ్‌సీఎల్, టైటాన్ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.27 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed