భారీ లాభాలను చూసిన మార్కెట్లు!

by Harish |   ( Updated:2020-04-30 06:37:56.0  )
భారీ లాభాలను చూసిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కోసం ప్రయోగాత్మకంగా రెమెడిసివిర్ ఔషధానికి సానుకూలంగా ఫలితాలు రావడంతో కీలక సూచీలు ఉదయం నుంచే లాభాల్లో కదలాడాయి. వరుసగా నాలుగు రోజులు మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఓ దశలో 1100 పాయింట్లకు పైగా వెళ్లిన సూచీలు లాభాల స్వీకరణతో కొంత తగ్గాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 997.46 పాయింట్ల లాభంతో 33,717 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 306.55 పాయింట్లు లాభపడి 9,859 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఆటో, మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా లాభాల్లో ట్రేడవ్వగా, ఫార్మా రంగం షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం విడుదల చేయనున్న నేపథ్యంలో సంస్థ షేర్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెస్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, హిందూస్తాన్ యూనిలీవర్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టల్లో ట్రేడవ్వగా, మిగిలిన సూచీలన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 63 పైసలు పెరిగి రూ. 75.03 వద్ద ఉంది. దేసీయ ఈక్విటీ మార్కెట్ల లాభాలు, విదేశీ ఫండ్‌ల ప్రావాహం వంటి సానుకూలంగా ఉండటంతో రూపాయికి కలిసొచ్చిందని ఫారెక్స్ నిపుణులు పేర్కొన్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 722.08 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. దీనికితోడు, మే 4 నుంచి ఇండియాలోని అనేక రంగాల్లో లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యే సూచనలు ఉండటంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడిందని మార్కెట్లు వర్గాలు భావిస్తున్నాయి.

Tags : sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed