మార్కెట్లకు స్వల్ప లాభాలు!

by Harish |
Stock market
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లకు కొంత ఊరట లభించింది. వారాంతంలో స్వల్ప లాభాలతో మార్కెట్లు ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉదయం 500 పాయింట్లకు పైగా ఎగిసినప్పటికీ, చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి కారణంగా చివరికి 199 పాయింట్ల లాభాలకు పరిమితమయ్యాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందనే సంకేతాలు సైతం మార్కెట్ వర్గాల్లో జోష్ నింపింది. సెన్సెక్స్ 199.32 పాయింట్ల లాభంతో 31,642 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 52.45 పాయింట్లు లాభపడి 9,251 వద్ద ముగిసింది. ముఖ్యంగా, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎమ్‌సీజీ, ఎనర్జీ షేర్లలో కొనుగోళ్లు జరగ్గా, బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. డా.రెడ్డీస్ ఆల్‌టైమ్ రికార్డ్ చేరింది. రిలయన్స్ సంస్థ మరో భారీ ఒప్పందం కారణంగా 4 శాతం ఎగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా లాభాల్లో ట్రేడవ్వగా, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ నష్టాల్లో ట్రేడయ్యాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed