ఊ…పందుకున్నాయి

by Harish |
ఊ…పందుకున్నాయి
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటనతో బుధవారం దేశీయ మార్కెట్లు ఊపందుకున్నాయి. దేశ జీడీపీలో 10 శాతానికి సమానమైన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటనను మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూశారు. సెన్సెక్స్ 637.49 పాయింట్లు లాభపడి 32,008 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 9,383 వద్ద ముగిసింది. అమెరికన్ మార్కెట్లు నష్టాలను చూడటంతో ఆసియా మార్కెట్ల సూచీలూ ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ పరిణామాలతో దేశీయ మార్కెట్లలోని ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లె ఇండియా, సన్‌ఫార్మా, హిందూస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలను చూడగా, మిగిలిన అన్ని సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed