- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) పాలసీ సమీక్ష నేపథ్యంలో ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అనంతరం నష్టాల్లోకి జారాయి. మిడ్-సెషన్‌కు ముందు వరకు రికార్డు స్థాయిలకు ఎగసిన సూచీలు ఆర్‌బీఐ పాలసీ కమిటీ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే నిర్ణయం మదుపర్లకు రుచించకపోవడంతో నష్టాల్లో ర్యాలీ చేశాయని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో లాభాల స్వీకరణ కారణంగా అమ్మకాల ఒత్తిడి అధికమవడంతో మార్కెట్లు డీలాపడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారుల్లో ప్రస్తుతం ద్రవ్యోల్బణ అంశంపై ఆందోళన అధికంగా ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 132.38 పాయింట్లు కోల్పోయి 52,100 వద్ద ముగియగా, నిఫ్టీ స్వల్పంగా 20.10 పాయింట్ల నష్టంతో 15,670 వద్ద ముగిసింది.
నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లు దిగజారగా, మెటల్, మీడియా, ఆటో ఇండెక్స్‌లో కొనుగోళ్లు మెరుగ్గా జరిగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడగా, నెస్లె ఇండియా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.04 వద్ద ఉంది.