- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో 800 వరకు ఎగిసిన సెన్సెక్స్ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడితో భారీగా దిగొచ్చింది. కరోనాకు విరుగుడుగా విదేశీ ఫార్మా కంపెనీ మోడర్నా వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగంగా క్లినికల్ పరీక్షల ఫలితాల్లో సానుకూల ఆశల నేపథ్యంలో ఉదయం ప్రారంభంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు దూసుకెళ్లాయి.
అయితే, మిడ్ సెషన్ తర్వాత కొనుగోళ్లు నెమ్మదించి అమ్మకాలు జోరందుకోవడంతో మార్కెట్లు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. దీంతో మార్కెట్లు కాస్త ఊగిసలాడినప్పటికీ చివరికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 18.75 పాయింట్లు లాభపడి 36,051 వద్ద ముగియగా, నిఫ్టీ 10.85 పాయింట్ల లాభంతో 10,618 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఆటో, ఐటీసీ, ఆల్ట్రా సిమెంట్, ఎంఅండ్ఎం షేర్లు లభాలను నమోదు చేయగా, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, ఓఎన్‌జీసీ, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.