39 వేల మార్కును దాటిన సెన్సెక్స్ !

by  |
39 వేల మార్కును దాటిన సెన్సెక్స్ !
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం లాభాలను నమోదు చేశాయి. అమెరికా మార్కెట్లు(American Markets) సరికొత్త గరిష్టాలను చేరడంతో దేశీయ మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సూచనలతో పాటు నిరంతర విదేశీ ఫండ్‌(Foreign Fund‌)ల ప్రవాహం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచిందని మార్కెట్ విశ్లేషకులు(Market analysts) అభిప్రాయపడ్డారు. చివరి గంటలో కొనుగోళ్ల మద్ధతు పెరగడం కూడా మార్కెట్ల జోరుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశీ నిధుల ప్రవాహంతో రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries), ఇన్ఫోసిస్(Infosys), కోటక్ బ్యాంక్(Kotak Bank) షేర్లు(Shares) దూకుడుగా కదిలాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఆరు నెలల తర్వాత 39 వేల మార్కును చేరుకోగలిగింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్(Sensex) 230.04 పాయింట్లు లాభపడి 39,073 వద్ద ముగియగా, నిఫ్టీ(Nifty) 77.35 పాయింట్లు ఎగిసి 11,549 వద్ద ముగిసింది.

నిఫ్టీలో మీడియా(Media) అధికంగా 2.5 శాతం పుంజుకోగా, బ్యాంకింగ్(Banking), ఆటో రంగాలు(auto sectors) 1 శాతానికి పైగా లాభపడ్డాయి, ఐటీ, రియల్టీ రంగాలు లాభాల్లో ట్రేడయ్యాయి. ఫార్మా(Pharma), ఎఫ్ఎంసీజీ రంగాలు(FMCG sectors) బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్(IndusInd Bank), రిలయన్స్(Reliance), యాక్సిస్ బ్యాంక్(Axis Bank), కోటక్ బ్యాంక్(Kotak Bank), బజాజ్ ఆటో(Bajaj Auto), హెచ్‌సీఎల్ టెక్(HCL Tech), ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ(ONGC) షేర్లు లాభాల్లో కదలాడగా, భారతీ ఎయిర్‌టెల్(Bharti Airtel), ఆల్ట్రా సిమెంట్(Ultra Cement), ఏషియన్ పెయింట్(Asian Paint), మారుతీ సుజుకి(Maruti Suzuki), ఎల్అండ్‌టీ(L&T), ఎన్‌టీపీసీ(NTPC), హెచ్‌డీఎఫ్‌సీ(HDFC), టెక్ మహీంద్రా(Tech Mahindra), నెస్లె ఇండియా(Nestle India) షేర్లు డీలాపడ్డాయి.


Next Story

Most Viewed