తండ్రితోనే రొమాన్స్ చేసింది.. ఆ విషయంలో సహజీవనం.. ఈ హీరోయిన్ కథే వేరు..

by Dishafeatures3 |
Pooja Bhatt
X

దిశ, సినిమా : ఒకప్పటి బాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ ముద్దుల కూతురు పూజా భట్ ఆయన డైరెక్షన్‌లోనే హీరోయిన్‌గా ఇంట్రడ్యూజ్ అయింది. ఒక్క సినిమాతోనే పాపులర్ అయిపోయిన బ్యూటీ.. ఓ కవర్ పేజీ కోసం తీసుకున్న బోల్డ్ డెసిషన్ సంచలనాత్మకంగా మారింది. తండ్రితో లిప్ కిస్ చేస్తూ మ్యాగజైన్ పేజీపై కనిపించి షాక్ ఇచ్చింది. దీంతో తండ్రీకూతుళ్ల రొమాన్స్‌పై దారుణమైన విమర్శలు వచ్చాయి. కానీ దీనిపై స్పందించిన మహేష్ భట్.. ఆమె తన కూతురు కాకపోయి ఉంటే పెళ్లి చేసుకునే వాడినని చెప్పడం మరింత నెగెటివిటీ వచ్చింది. మొత్తానికి పూజ కెరీర్ ముగిసిపోయే పరిస్థితి రావడంతో మద్యానికి అలవాటు అయిపోయింది.

కాగా రీసెంట్‌గా తన ఫ్రెండ్ దీపక్ తిజోరీ డైరెక్షన్‌లో వచ్చిన ‘టిప్సి’ చిత్రంలో నటించిన ఆమె.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఓపెన్‌గా మాట్లాడింది. ‘నేను మందుకు బానిస అయిపోయా. దానితో సహజీవనం చేశాక 44వ ఏటా ఆ హ్యాబిట్‌ను మానుకున్నా. ఇలా చెప్పుకునేందుకు సిగ్గుపడట్లేదు. నాలా మరొకరు ఇలా జీవితాన్ని నాశనం చేసుకోకూడదని చెప్తున్నా. ఈ జనరేషన్‌లో మహిళలు చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. పరిస్థితులను డీల్ చేయలేక ఆల్కహాల్‌కు అలవాటు పడుతున్నారు. దాని నుంచి బయటపడితే ఓకే కానీ లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి కోణంలో ఈ సినిమా రావడం హ్యాపీగా ఉంది’ అని చెప్పుకొచ్చింది పూజ.

Read More..

పెళ్లి కొడుకు చేసిన పనికి మండపంలో ఎమోషనల్ అయిన బుల్లితెర నటి ఆర్తి సింగ్.. వీడియో వైరల్



Next Story

Most Viewed