NEET Examination: నీట్‌ ఎగ్జామ్ పేపర్ లీక్..! క్లారిటీ ఇచ్చిన నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ

by Disha Web Desk 1 |
NEET Examination: నీట్‌ ఎగ్జామ్ పేపర్ లీక్..! క్లారిటీ ఇచ్చిన నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే నీట్ పరీక్షను ఆదివారం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పేపర్ లీకైదంటూ సోషల్ మీడియాలో వీపరీతంగా వదంతులు వచ్చాయి. ఈ మేరకు వాటన్నింటిపై నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చింది. పేపర్ లీక్ అయ్యిందనే సమాచారం ఫేక్ అంటూ కొట్టి పడేసింది. ఈ విషయంలో అభ్యర్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే దేశంలో 557 నగరాలు, ఇతర దేశాల్లోని 14 ప్రధాన నగరాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్‌ యూజీ పరీక్ష కొనసాగింది.

ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపూర్‌లోని మాంటౌన్‌లోని గర్ల్స్ హయ్యర్‌ సెకండరీ ఆదర్శ్‌ విద్యా మందిర్‌లో హిందీ మీడియం విద్యార్థులకు పొరపాటున ఇంగ్లీష్ ఎగ్జామ్ పేపర్ రావడంతో ఇన్విజిలేటర్‌ ఆ పొరపాటును సరిదిద్దేటప్పటికే విద్యార్థులు పరీక్ష హాలు నుంచి ప్రశ్నపత్రంతో బలవంతంగా బయటకు వెళ్లిపోయారు. అలా విద్యార్థులు బలవంతంగా బయటకు వెళ్లడంతో సాయంత్రం 4 గంటల సమయంలో ప్రశ్నపత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేసినట్లు ఎన్‌టీఏ అధికారి వెల్లడించారు. కానీ అప్పటికే అన్ని సెంటర్లలో పరీక్ష మొదలైందని, అందుకే కశ్చన్ పేపర్ లీక్‌ కాలేదని స్పష్టం చేశారు. పేపర్ తప్పుగా వచ్చిన 120 మంది విద్యార్థులకు మరో తేదీ ప్రకటించి పరీక్ష నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed