- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Train tickets: రైలు టికెట్లపై శుభవార్త చెప్పిన రైల్వేశాఖ..
దిశ వెబ్ డెస్క్: దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మనలో చాలామంది రైల్లో ప్రయాణించేందుకే మక్కువ చూపుతారు. ఎందుకంటే బస్సు టికెట్ ధరతో పోల్చుకుంటే రైలు టికెట్ ధర తక్కువ, అలానే సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ఇక జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ ధర మరింత తక్కువగా ఉంటుంది. అయితే ఏసీ, సెకండ్ క్లాస్ కంపార్టుమెట్లల్లో ప్రయాణించే వారు ఆన్లైన్‌లో ముందుగానే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును రైల్వేశాఖ కల్పించింది.
కానీ జనరల్ టికెట్‌ను మాత్రం రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌లో మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. ఇక UTS యాప్‌లో బుక్ చెయ్యాలి అనుకుంటే, కేవలం రైల్వే స్టేషన్‌కు 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం UTS యాప్ (అన్ రిజర్వుడ్ టికెట్ సిస్టమ్) లో రైల్వే శాఖ మార్పులు చేసింది. ఇకపై UTS యాప్ ద్వారా ఫోన్‌లోనే ఎంత దూరమైనా జనరల్ టికెట్లు బుక్ చేసుకునేలా సౌలభ్యం కల్పించినట్టు పేర్కొంది.
అయితే స్టేషన్‌కు 50 కిలోమీటర్ల లోపు ఈ యాప్ పని చెయ్యదు. ఏదేమైనా ఈ యాప్ వల్ల కౌంటర్లు వద్ద క్యూలో వెయిట్ చేసే సమస్య తప్పింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.