- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
42 ఏళ్ల వయసులో ఆ నటి మళ్లీ పెళ్లి.. నెట్టింట దుమారం రేపుతున్న పోస్ట్.. అంత పెద్ద కొడుకు ఉండగా.. ఛీ ఛీ..
దిశ, సినిమా : సెలబ్రిటీ అయిపోయారంటే వారి లైఫ్ గురించి సొసైటీ కొంత అటెన్షన్‌తో ఉంటుంది. ఆ వ్యక్తుల జీవితాల్లో ఏం జరిగింది, ఏం జరగబోతుందనే విషయాల గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతుంది. అయితే ఆ ఎగ్జయిట్మెంట్ కాస్త లిమిట్ దాటితే.. అసలు విషయం తెలుసుకోకుండా రూమర్స్ క్రియేట్ చేస్తే మాత్రం సెలబ్రిటీలు నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. మలయాళ నటి రేఖా రతీశ్ విషయంలో ఇదే జరిగింది. కొత్త కారు కొన్న ఆమె న్యూ ఫ్యామిలీ మెంబర్‌కు వెల్ కమ్ చెప్పబోతున్నామని పోస్ట్ పెట్టింది. దీంతో గాసిప్స్ ఊపందుకున్నాయి. రెండో పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం జరిగింది.
దీనిపై స్పందించిన రేఖ చాలా బాధపడిపోయింది. ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారనే కనీసం కారు తెచ్చుకునేందుకు షో రూమ్‌కు కూడా వెళ్లలేదు. కొడుకు, మేనళ్లుడు వెళ్లి తీసుకొచ్చారు. ఇంత పెద్ద కుమారుడు ఉండగా.. ఇలాంటి విషయాలు స్ప్రెడ్ చేస్తే ఎలా ఉంటుంది? తన కొడుకును తెలిసిన వాళ్లు హేళన చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది. ఇకనైనా తమను వదిలేయాలని.. పర్సనల్ స్పేస్ ఇస్తే బాగుటుందని కోరింది.