ఉగ్రదాడి బీజేపీ ఎలక్షన్ స్టంట్: మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

by samatah |
ఉగ్రదాడి బీజేపీ ఎలక్షన్ స్టంట్: మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన కాన్వాయ్‌పై శనివారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఓ సైనికుడు మరణించగా..నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి బీజేపీ ఎలక్షన్ స్టంట్ అని అభివర్ణించారు. ఎన్నికల ముందు ఇలాంటి దాడులు జరగడం బీజేపీ స్టంట్ తప్ప మరోటి కాదని స్పష్టం చేశారు. తాను ఎంపీగా పోటీ చేస్తున్న జలంధర్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ దాడి కాషాయ పార్టీ స్టంట్ తప్ప ఉగ్రదాడి కాదని తెలిపారు. అందులో వాస్తవం లేదని..బీజేపీ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, గత ఎన్నికల సమయంలోనూ ఈ తరహా దాడులు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల టైంలో బీజేపీ ఇలాంటి విన్యాసాలకు పాల్పడుతోందని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చరణ్ జిత్ ప్రకటన ఫేలవమైందని, ఇది కాంగ్రెస్ మనస్తత్వాన్ని ప్రతిభింభిస్తుందని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed