సీఎంగా రేవంత్ పాలమూరుకు చేసింది ఏమీ లేదు : డీకే అరుణ

by Disha Web Desk 11 |
సీఎంగా రేవంత్ పాలమూరుకు చేసింది ఏమీ లేదు : డీకే అరుణ
X

దిశ, జడ్చర్ల : 6 గ్యారంటీలు అంటూ నమ్మించి రాష్ట్ర ప్రజలను ఆగం చేసిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తెలంగాణకు మోడీ ఏం చేశాడని ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదని గాడిద గుడ్డు తప్ప.. పాలమూరు ఆడబిడ్డ పై వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప అని సీఎం రేవంత్ రెడ్డి పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు డీకే అరుణ. ఆదివారం జడ్చర్ల నియోజకవర్గం లోని ఉరుకొండ, మిడ్జి,ల్ జడ్చర్ల, రాజాపూర్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ప్రచారానికి ఆయా గ్రామాల్లోని ప్రజలు మహిళలు భారీ సంఖ్యలో హాజరై బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆమె ఊరుకొండ పేట ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాదారం, మిడ్జిల్, దోనూర్, గంగాపూర్, రాజాపూర్, జడ్చర్ల ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి డీకే అరుణ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటు వేస్తే లక్కీ లాటరీ లాగా రేవంత్ గెలిచాడని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక వంద రోజుల్లోనే మహిళలకు ఇస్తానన్న రూ. 2,500 ఇచ్చావా..? నేను రాగానే రుణమాఫీ అంటివి ఇప్పుడేమైంది ఆ హామీ అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ వాళ్లను ఊర్లోకి రాని వద్దన్నారు.

ఫ్రీ బస్ పేరు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మారుమూలాల గ్రామాలకు ఉన్న బస్సులు తీసేసిందని రుణమాఫీ పై మళ్లీ మాయమాటలు చెబుతూ దేవుళ్ళ మీద ఓట్లు అంటూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారని అన్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికలు దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలని, దేశంలో ఏ మూలకు పోయిన మోడీ చేసిన అభివృద్ధితో మోడీ ప్రభంజనం కనిపిస్తోందని అన్నారు. గత 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఈ దేశాన్ని దోచుకుతిందని, గత 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని ఎన్నో పనులు మోదీ ఈ పదేళ్లలో చేసి చూపించారని అందుకు నిదర్శనం మహిళలు ఆత్మగౌరవంతో బతికేలా మరుగుదొడ్లు నిర్మించారని, కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశ ప్రజల ఆదుకున్నది వ్యాక్సిన్ అందించి కాపాడింది మోదీ నేనని గుర్తు చేశారు.

మోడీ కేడి అంటూ దేశ ప్రధానిని కించపరుస్తూ ఒక మహిళ అని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి మోడీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు.ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చిన తనను ఆశీర్వదించి బిజెపి గుర్తైనా కమలం పువ్వు పై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని డీకే అరుణ అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలా త్రిపుర సుందరి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మిడ్జిల్ మండల ఇన్చార్జ్ ముచ్చర్ల జనార్ధన్, బిజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి, మిడ్జిల్ వైస్ ఎంపీపీ తిరుపతమ్మ, రవీందర్ గౌడ్, బిజెపి మండల అధ్యక్షులు ఆంజనేయులు, కావలి నరేందర్, మధు, జడ్చర్ల పట్టణ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు మామిడి మాడ భాస్కర్, ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, నరేష్, వెంకట్, బాలు, సురేష్ ,బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed