- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెక్స్ స్కాండల్ కేసు : ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్టు వారెంట్ జారీ
దిశ, నేషనల్ బ్యూరో: హసన సెక్స్ స్కాండల్ కేసులో నిందితుడు, మాజీ ప్రధాని మనుమడు ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టుని ఆశ్రయించింది. కోర్టు అనుమతితో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తొలి దశ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు హల్ చల్ చేశాయి. లైంగిక వేధింపులకు గురైన మహిళల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది.
అయితే, వీడియోలు బయటకొచ్చిన వెంటనే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి పారిపోయినట్లు సమాచారం. అతడ్ని పట్టుకునుంకు ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇదిలావుండగా, ఈకేసులో అరెస్టు అయిన ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రేవణ్ణకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను బెంగళూరు కోర్టు మే 20 వరకు పొడిగించింది. మహిళను కిడ్నాప్ చేసిన కేసులో రేవణ్ణను సిట్ అరెస్టు చేసింది. ఇకపోతే, హసన సెక్స్ స్కాండల్ కేసుల విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీ(ఎస్) మాత్రం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది.