- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీనిధి, గురునానక్ కాలేజీలపై చర్యలుంటాయ్: బుర్ర వెంకటేశం
దిశ, తెలంగాణ బ్యూరో: షెడ్యూల్‌కు ముందే సీట్లు భర్తీ చేసుకున్నట్టు ఫిర్యాదులు వస్తే ఆ కాలేజీలపై చర్యలు తప్పవని, శ్రీనిధి, గురునానక్ కాలేజీలపై చర్యలుంటాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం హెచ్చరించారు. జేఎన్టీయూలో ఈఏపీసెట్ ఫలితాలు విడుదలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంజనీరింగ్ విభాగంలో బీ కేటగిరీ సీట్లను కూడా ఆన్ లైన్ లోనే భర్తీచేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈఏపీసెట్‌ను మొదటిసారిగా నిర్వహించామని, గతంలో ఎంసెట్ పేరిట పరీక్షలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు.
అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈఏపీసెట్‌కు గత పదేండ్లలో లేనంతమంది ఈసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఒక్కో షిఫ్టులో దాదాపు 50 వేల మంది పరీక్ష రాశారని వివరించారు. గతంలో ఒక్కో షిఫ్ట్‌లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాసేవారని తెలిపారు. కాగా ఫలితాలు చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారు. కాగా అడ్మిషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు.