Titanic Actor: టైటానిక్ మూవీ యాక్టర్ కన్నుమూత.. శోకసంద్రంలో హాలీవుడ్ ఇండస్ట్రీ

by Shiva |
Titanic Actor: టైటానిక్ మూవీ యాక్టర్ కన్నుమూత.. శోకసంద్రంలో హాలీవుడ్ ఇండస్ట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ కలిగిన చిత్రాల్లో టైటానిక్ మూవీ ముందు వరుసలో నిలుస్తోంది. 'టైటానిక్‌' అనగానే ఓ మరపురాని దృశ్య కావ్యం కళ్ల ముందు కదలాడుతూ.. ప్రపంచాన్ని కుదిపేసిన ఓ పెను విషాదం మనసులు తొలిచేస్తుంది. సరిగ్గా 1912లో జరిగిన ఈ ఓడ ప్రమాదాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ, అందుకు ఓ అందమైన ప్రేమ కథనూ ప్రేక్షకులకు పరిచయం చేశాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆ చిత్రంలో ప్రతి పాత్ర అద్భుతమే. ఈ నేపథ్యంలోనే 1997లో విడుదలైన టైటానిక్ చిత్రంలో కెప్టెన్ పాత్రలో కనిపించిన ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ (79) ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన చనిపోయారనే వార్త హాలీవుడ్ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది. అయితే, బెర్నార్డ్ హిల్ టైటానిక్ చిత్రంలో ‘కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్’ పాత్రను పోషించాడు. సినిమాలో అతడి క్యారెక్టర్ సో స్పెషలే అని చెప్పాలి. ఆయన టైటానిక్‌లోనే కాకుండా ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సినిమాలోనూ నటించాడు. ఇక తన కెరీర్‌లో, ఆయన సినిమాల్లోనే కాకుండా టీవీ షోలు మరియు థియేటర్‌లో కూడా పని చేశాడు. సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న బెర్నార్డ్ హిల్ ఏకంగా 11 ఆస్కార్ అవార్డులు గెలుచున్నాడంటే.. ఆయన ఏ స్థాయి నటుడో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed