షారుఖ్‌, సైఫ్‌ అలీఖాన్‌లు బలవంతంగా నన్ను తీసుకెళ్ళీ ఆ పని చేసారు.. ఆ రోజు రాత్రి నేను నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నా..

by Dishafeatures1 |
షారుఖ్‌, సైఫ్‌ అలీఖాన్‌లు బలవంతంగా నన్ను తీసుకెళ్ళీ ఆ పని చేసారు.. ఆ రోజు రాత్రి నేను నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నా..
X

దిశ,సినిమా:నటి విద్యాబాలన్ అందరికీ సుపరిచితమే. గౌతమ్ హల్దార్ దర్శకత్వం వహించిన బెంగాలీ చిత్రం ‘భలో తేకో’(2003) తో విద్యా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమె జీవితంలో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి అనేక ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటుంది.

తాజాగా 'ఫిల్మ్‌ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్‌ లేనివాళ్లను ఎంత చులకనగా చూస్తారో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి.' అంటూ ఓ ఇంటర్‌వ్యూలో గత స్పృతులను గుర్తుచేసుకున్నది అందాలభామ విద్యాబాలన్‌. 'అది 2008. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక జరుగుతున్నది. అప్పట్లో నేను అంత తొందరగా చొచ్చుకుపోయే తత్వం కాదు. సైలెంట్‌గా వేడుక చూస్తున్న నన్ను ఉన్నట్టుండి అవార్డు తీసుకోమని స్టేజ్‌పైకి ఆహ్వానించారు. 'హేయ్‌ బేబీ' సినిమాలోని నా కాస్ట్యూమ్‌కి వచ్చిన అవార్డు అది.

అసలు ప్రజాదరణ పొందని వారికి ఇచ్చే అవార్డు అది. అందరూ నవ్వుతూ నన్నే చూస్తున్నారు. ఆ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ని నేను కాదని, అవి ఆయన డిజైన్‌ చేసిన కాస్ట్యూమ్సనీ.. వాటితో నాకేంటి సంబంధం అని నేను చెబుతున్నా వినలేదు. చివరకు నా దర్శకుడు, కాస్ట్యూమ్‌ డిజైనర్‌లతో కలిసి ఈ అవార్డు తీసుకుంటాను.. అని అడిగినా ఒప్పుకోలేదు. బలవంతంగా స్టేజ్‌పై తీసుకెళ్లి షారుఖ్‌, సైఫ్‌ అలీఖాన్‌లు ఇద్దరూ కలిసి ఆ అవార్డు నాకందించిన. నిజం చెబుతున్నా ఆ రోజు రాత్రి నేను నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నాను. ఇలా అందరి ముందు నన్ను అవమానించే సాహసం చేశారంటే కారణం, ఇండస్ట్రీలో నా వెనుక ఎవ్వరూ లేకపోవడమే.' అంటూ ఆవేదన వ్యక్తపరిచారు విద్యాబాలన్‌.



Next Story

Most Viewed