రాజ్యాంగం, రిజర్వేషన్లు రద్దు వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన బీజేపీ సీఎం

by Disha Web Desk 19 |
రాజ్యాంగం, రిజర్వేషన్లు రద్దు వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన బీజేపీ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు ఉత్తరాఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన తెలంగాణలో క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లు రద్దు చేయడం, రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం బీజేపీకి, ప్రధాని మోడీకి లేదని క్లారిటీ ఇచ్చారు. ఎప్పటి నుంచో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు మోడీ ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. వారి కోసం ఎన్నో పథకాలను కూడా ప్రధాని ప్రారంభించారని తెలిపారు.

బీజేపీ రాజ్యాంగం, రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ఎవరైతే అసత్యాలు, భ్రమలు వ్యాప్తి చేస్తున్నారో, ప్రజల్లో తప్పుడు సందేహాలు వచ్చేలా చేస్తున్నారో వారిపై సమీప భవిష్యత్‌లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో కొందరు ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని, ఇటీవల కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాకు సంబంధించి ఓ నకిలీ వీడియో తయారు చేశారన్నారు. అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంపై విచారణ జరగుతోందని, తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story

Most Viewed