- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్టీఆర్ లేకుండానే వైజాగ్ చెక్కేస్తున్న ‘దేవర’ టీమ్.. షాక్‌లో ఫ్యాన్స్!
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ రూపొందబోతుంది. ఇక ఇందులో నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ ఎంతో ఆకట్టుకోగా.. దసరా కానుకగా అక్టోబర్ 10న ‘దేవర’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.
రిలీజ్ సమయం దగ్గర పడటంతో షూటింగ్లో వేగం పెంచారు మూవీ టీం. ఇప్పటికే గోవాలో సాంగ్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కాగా.. తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వైజాగ్‌లో స్టార్ట్ కానున్నట్లు సమాచారం. కానీ, ఎన్టీఆర్ మాత్రం వైజాగ్ రావడం లేదు. ఎందుకంటే.. ఈ షెడ్యూల్లో ఎన్‌టీఆర్‌లేని సన్నివేశాలను షూట్ చేయనున్నారట చిత్రం యూనిట్. అంతే కాకుండా.. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ అయిన ‘వార్ 2’ షూటింగ్లో బిజీగా ఉండటంతో.. ‘దేవర’ లో ఆయన లేని సీన్స్ షూట్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారట మూవీ టీమ్. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో వైజాగ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ‘మా అన్న (ఎన్టీఆర్) వైజాగ్ రావడం లేదా’ అంటూ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
Read More...
BREAKING: దేవర మూవీ యూనిట్‌పై తేనెటీగల దాడి.. ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్