- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా ఫ్యామిలీతో గొడవ.. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన బన్నీ.. బధం తెగిపోయినట్లేనా!
దిశ, సినిమా : ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఇష్యూ ఏదైనా ఉన్నదా అంటే అది మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గొడవలే అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో బన్నీ ఎక్కవగా ట్రోలింగ్‌కు గురి అవుతున్నాడు ముఖ్యంగా ఏపీ రాజకీయ ప్రచారంతో ఈయన పేరు మారుమోగిపోతుంది.
అసలు విషయంలోకి వెళితే.. అల్లు అర్జున్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది బాగున్నప్పటికీ ఆయన నంద్యాలకు వెళ్లి వైసీపీ నాయకుడికి ప్రచారం చేయడం మెగా అభిమానులను నిరాశకు గురి చేసింది. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ అల్లు అర్జు్న్ మీద ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండా ఈ మధ్య నాగబాబు సైతం బన్నీని టార్గెట్ చేస్తూ షాకింగ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బన్నీ కూడా నాగబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలా ఇద్దరి మధ్య ట్వీట్స్ దాడి పెరిగిపోవడం, తర్వాత నాగబాబు అకౌంట్ క్లోజ్ అవ్వడం జరిగింది.
అయితే తాజగా సమాచారం ప్రకారం, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య గొడవలు తారా స్థాయికి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా, అల్లు అర్జున్ కూడా మెగా కాంపౌండ్ పేరు మీద ఉండే వాట్సాప్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యాడంట. మెగా ఫ్యామిలీతో గొడవల కారణంగానే ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. కాగా, అది మెగా ఫ్యామిలీకి సంబంధించిన కీలక గ్రూప్ అని దాని నుంచి అల్లు అర్జున్ లెఫ్ట్ కావడం షాకింగ్ ఇన్సిడెంట్ అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.