- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Scam: జోరుగా నకిలీ పట్టాల సర్టిఫికెట్ల దందా.. పట్టించుకోని అధికారులు..!
దిశ, ఆర్మూర్: పట్టణ కేంద్ర పరిధిలోని మున్సిపల్ 19వ వార్డు ఏరియాలోని జర్నలిస్ట్ కాలనీ(Journalist Colony)లో నకిలీ పట్టాల సర్టిఫికెట్ల(Fake degree certificates)ను సృష్టించి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసుకుంటూ పలువురు రియల్టర్లు దండిగా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పట్టణం జర్నలిస్ట్ కాలనీలో కొన్ని సంవత్సరాల కిందట రెవెన్యూ అధికారులు(Revenue Officers) నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈ పట్టా సర్టిఫికెట్ ఇచ్చి సుమారు 20ఏళ్లు గడుస్తున్నాయి.
జర్నలిస్ట్ కాలనీలో ప్రభుత్వ స్థలం ఉండడంతో కొందరు అక్రమార్కులు ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి నూతన పంతాలో ఏళ్లుగా కొత్త ప్రణాళికలను రచిస్తూ, అధికారులను మామూళ్ల మత్తులో జోకుతూ దండిగా ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. రెవెన్యూ అధికారులు పట్టా సర్టిఫికెట్లు జారీ చేయకున్నా అక్రమార్కులు వారే నకిలీ పట్టాలు సృష్టిస్తున్నట్టు జోరుగా చర్చ జరుగుతుంది.
నకిలీ పట్టాలు సృష్టించి ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner of Armour) ద్వారా ఇంటి నెంబర్లను దొడ్డిదారిలో నిర్మాణాల కంటే ముందుగానే పొందుతున్నారు. మున్సిపల్ అధికారుల పరోపకార సహాయంతో ఇంటి నంబర్లు అందుకొని అటు తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని రాత్రికి రాత్రే ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా షెడ్లు వేస్తూ ప్రభుత్వ స్థలాలను దొడ్డిదారిన అక్రమ పద్ధతిలో ఆక్రమించుకుంటున్నారని ఆర్మూర్లో జనం కోడై కుస్తున్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(MLA Paidi Rakesh Reddy)కి తెలియడంతో ఆయన ప్రభుత్వ స్థలాల్లో రాత్రికి రాత్రి షెడ్లు వేసిన ఆ స్థలాలను స్థానిక మున్సిపల్ కమిషనర్ రాజు(Commissioner Raju), తహసీల్దార్ గజనాన్(Tehsildar Gajanan) లతో కలిసి పరిశీలించి తొలగించాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చొరవతో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. మరింత లోతుగా పరిశీలన జరపగా జర్నలిస్టు కాలనీలో కొందరు రెవెన్యూ అధికారుల ప్రమేయం లేకుండానే నకిలీ పట్టా సర్టిఫికెట్లు తయారుచేసి బదిలీ అయిన అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తున్నట్లు ఆర్మూర్ లో ప్రజలు చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ నకిలీ పట్టా సర్టిఫికెట్ల ద్వారా విలువైన ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నెంబర్లు తీసుకొని షెడ్లు వేసి అక్రమార్కులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు(Real estate traders) కబ్జాలకు పాల్పడుతున్నట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ప్రభుత్వ స్థలాల్లో షెడ్లు వేసిన వారి పట్టా సర్టిఫికెట్లను పరిశీలించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సర్టిఫికెట్లు అసలువా లేక నకిలీల అన్నది గుర్తించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
జర్నలిస్ట్ కాలనీలో అసైన్మెంట్ భూమిలో ప్లాట్ల అమ్మకాలు..!
మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని జర్నలిస్ట్ కాలనీలో 401-66 ప్రభుత్వ సర్వే నంబర్లు కొందరు ఇంటి నంబర్లు సృష్టించి అసైన్మెంట్ భూమి(Assignment land)లో రాత్రికి రాత్రే షెడ్లను నిర్మానిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్ లను ఇంటి నెంబర్ల పేరుపై చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో తెలిసింది. ఈ జర్నలిస్ట్ కాలనీలో అసైన్మెంట్ భూముల్లో ఇంటి నంబర్లు కేటాయిస్తూ ఈ ఇల్లీగల్ రియల్ వ్యాపారా(Illegal real business)న్ని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు లెక్కలు తీయించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్మూర్ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ అసైన్మెంట్ స్థలాలకు నాలా కన్వర్షన్ లేకపోవడంతో అధికారులతో సదరు అక్రమ వ్యాపారులు మిలాఖత్ అయి ముందస్తుగా ఇంటి నంబర్లను తీసుకుని, ఆ ఇంటి నంబర్ల ఆధారంగా ప్రభుత్వ భూముల్లో అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తూ దండిగా రియల్ వ్యాపారాలను చేస్తున్నట్లు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని జనం కోడైకుస్తుంది.
తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ తో సమావేశం ఏర్పాటు చేసి విచారణ చేయిస్తా...
రాజా గౌడ్, ఆర్మూర్ ఆర్డీవో
పట్టణ కేంద్ర పరిధిలోని జర్నలిస్ట్ కాలనీలో జరుగుతున్న ఇండ్ల నిర్మాణాలపై, అసైన్మెంట్ భూముల్లో ప్లాట్ల అమ్మకాలపై తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ తో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తాం. జర్నలిస్ట్ కాలనీలో జరుగుతున్న నిర్మాణాలపై విచారణ చేయిస్తాం. జర్నలిస్ట్ కాలనీలో నిర్మాణ పనులకు తీసుకున్న అనుమతుల ఆధారాలతో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాల వద్దకు ఇద్దరు అధికారులను మున్సిపల్, రెవెన్యూ సిబ్బందితో కలిసి వెళ్లి పక్కాగా పరిశీలన చేయిస్తాం.