ఏపీలో త్రాగునీరు కలుషితం.. అలర్టైన ఏపీ సర్కార్.. పీహెచ్ సీలకు ఎమర్జెన్సీ కిట్లు

by Rani Yarlagadda |
ఏపీలో త్రాగునీరు కలుషితం.. అలర్టైన ఏపీ సర్కార్.. పీహెచ్ సీలకు ఎమర్జెన్సీ కిట్లు
X

దిశ, వెబ్ డెస్క్: సీజనల్ వ్యాధులు, జ్వరాలు, ఫుడ్ పాయిజన్స్ (Food Poisons) పై ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న పీహెచ్ సీ (PHC)లకు ఫీవర్ ఎమర్జెన్సీ కిట్స్ (Fever Emergency Kits) ను తరలించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సీజనల్ వ్యాధులు, ఫుడ్ పాయిజన్ల కేసులు పెరుగుతున్న క్రమంలో.. జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా వాటర్ కంటామినేషన్ (Water Contamination) పై అధికారులు దృష్టి పెట్టాలని సూచించింది. త్రాగునీటి శాంపిల్స్ ను ఎప్పటికప్పుడు పరీక్షించాలని తెలిపింది. మరీ ముఖ్యంపై విజయవాడ నీటి సరఫరా పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని తాగాలని అధికారులు సూచిస్తున్నారు.

విశాఖలో డయేరియా

విశాఖపట్నం సాయినగర్లో పైప్ లైన్ పగిలి మంచినీరు కలుషితమైంది. ఆ నీటిని తాగిన ప్రజలు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. విషయం తెలుసుకున్న జీవీఎంసీ సిబ్బంది పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. గాజువాక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులు కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed