- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలికను కాటేసిన పాము.. స్నేక్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు.. అసలు ఏమైందంటే!(వీడియో)
దిశ, ఫీచర్స్: చందేయ్ తానా జిల్లాలోని దులాత్పూర్ గ్రామానికి చెందిన ఓ బాలిక తన ఇంటికి సమీపంలో పువ్వులను తెంపుతుండగా, ఓ పాము కాటేసింది. పాము కాటుకు భరించలేని బాలిక గట్టిగా ఏడ్చింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం కాటేసిన పామును కూడా పట్టుకుని ఆస్పత్రికి తరలించారు.
బాలికను జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం బీహార్ షరీఫ్ సదార్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే పామును ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ ఉన్న రోగులు, సిబ్బంది షాక్ అయ్యారు. పాము ప్లాస్టిక్ డబ్బాలో నుంచి తప్పించుకోవడంతో ఆందోళనకు గురైన రోగులు పరుగులు తీశారు. మొత్తానికి మళ్లీ ఆ పామును పట్టి అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
అయితే బాలికను ఏ పాము కాటేసిందో తెలుసుకుంటే, దానికి తగ్గ వైద్యం అందిస్తారనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఆ పామును బంధించి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు అధికారుల విచారణలో తేలింది. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
बेटी को सांप ने काटा तो उसे बेटी के साथ अस्पताल ले आए परिजन !!
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) May 16, 2024
फैल गई दहशत, देखिए VIDEO #viralvideo #Bihar #ViralVideo pic.twitter.com/QMVVvM9VAI