ఇద్దరు ఆఫీసు ఎంప్లాయిస్ మధ్య గాసిప్ చివరకు ఇంత దారుణానికి దారితీసిందా?

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-07 04:59:49.0  )
ఇద్దరు ఆఫీసు ఎంప్లాయిస్ మధ్య గాసిప్ చివరకు ఇంత దారుణానికి దారితీసిందా?
X

దిశ, ఫీచర్స్: ఆఫీస్ బ్రేక్ లేదా లంచ్ టైమ్ లో కొలీగ్స్ గురించి గాసిప్స్ మాట్లాడుకోవడం కామన్. ముఖ్యంగా ఆ రోజు అబ్సెంట్ అయిన వ్యక్తిపై బోలెడు కుళ్లు జోకులు వేసుకోవడం.. తన క్యారెక్టర్ ఏంటో తేల్చేయడం చేస్తాం. కానీ ఈ మాటలు మన జీవితంపై చాలా ఎఫెక్ట్ చూపుతాయి. ఈ గాసిపింగ్ ఎవరైతే చేశారో వారి మధ్య స్నేహం ఏర్పడితే.. ఎవరి మీద చేశారో వాళ్లతో మాత్రం ఎనిమీస్ అయిపోతారు. అయితే దీనిపై తాజాగా ఓ అధ్యయనం నిర్వహించిన శాస్తవ్రేత్తలు.. అసలు ఈ గాసిప్ ఎందుకు జరుగుతుంది? దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

ఎందుకు జరుగుతుంది?

1. నిజానికి గాసిప్ సమాచార మార్పిడిని ఆశించి జరుగుతుంది. అక్కడ కొందరి మధ్య ఏర్పడిన రిలేషన్స్ గురించి తెలుసుకునేందుకు జరిగే కన్వర్జేషన్.. సోషల్ సపోర్ట్ కూడా కోరుకుంటుంlది.

2. విషపూరిత వ్యక్తుల గురించి ఎదుటి వారిని హెచ్చరించేందుకు కూడా మాటల మార్పిడి జరుగుతుంది. ఈ క్రమంలో వారి నుంచి కాపాడొచ్చు.

3. ఒక విషయంలో తేడా వస్తే వారిని టార్గెట్ చేస్తూ కొంత మిస్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉంటుంది. ఇది ఆ వ్యక్తిపై పాజిటివ్ లేదా నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుంది.

ఎఫెక్ట్స్

* కొన్నిసార్లు ఒక గాసిప్ క్రియేట్ చేసే వ్యక్తి సరైన కారణంతో ఆ పని చేస్తే.. ఆ రీజన్ నిజమేనని చేయబడినవాడు గ్రహిస్తే.. వారిద్దరి మధ్య స్ట్రాంగ్ బాండ్ ఏర్పడుతుంది. వారిని ఇంకా ఎక్కువ నమ్మడం మొదలుపెట్టేస్తారు. కానీ ఇది రేర్ గా జరుగుతుంది.

* కొన్ని మాటలు కొందరిపై చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చూపుతాయి. కొన్నిసార్లు తలెట్టుకునే అవకాశం లేకుండా చేస్తాయి. ఆ ఆఫీస్ ను వదిలిపెట్టి వెళ్ళిపోయేందుకు దారితీసే పరిస్థితులు నెలకొంటాయి.

* ఇక గాసిప్స్ మాట్లాడుకునే ఇద్దరిలో ఒకరు తప్పుగా మాట్లాడుకోవడం నిజంగా రాంగ్ అని గ్రహిస్తే.. తమ మిస్టేక్ గురించి రిగ్రేట్ ఫీల్ అవొచ్చు. ఈ మాటలను ఖండిస్తే ఆ ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ దెబ్బ తినొచ్చు. బద్ధ శత్రువులుగా మారవచ్చు. అందుకే గాసిప్స్ మాట్లాడుకునే ముందు కొద్దిగా ఆలోచించాలని సూచిస్తున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed