వరుస లాభాలకు బ్రేక్.. స్వల్ప నష్టాల్లో మార్కెట్లు!

by Harish |
వరుస లాభాలకు బ్రేక్.. స్వల్ప నష్టాల్లో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ :
వరుస లాభాలతో దూసుకెళ్లిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. ఉదయం నుంచే ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు బలహీనపడటంతో మార్కెట్ల సూచీలు క్షీణించాయి. వరుస లాభాల తర్వాత ట్రేడర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 58.81 పాయింట్లు కోల్పోయి 37,871 వద్ద ముగియగా, నిఫ్టీ 29.65 పాయింట్లు నష్టపోయి 11,132 వద్ద ముగిసింది. అమెరికాతో పాటు వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి అధికమవుతుండటంతో ఇన్వెస్టర్లు ఎక్కువగా బంగారంపై ఆసక్తి చూపించారని, ఈ పరిణామాల్లోనే మార్కెట్ల సెంటిమెంట్ బలహీనపడినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, టైటాన్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, రిలయన్స్ షేర్లు అధిక లాభాలను నమోదు చేయగా, హిందూస్తాన్ యూనిలీవర్, టాటా స్టీల్, మారుతీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్అండ్‌టీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, నెస్లె, కోటక్ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి.

Advertisement

Next Story

Most Viewed