డీలాపడ్డ సూచీలు..మార్కెట్లకు నష్టాలు!

by Harish |
డీలాపడ్డ సూచీలు..మార్కెట్లకు నష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్కెట్లకు నష్టాల బెడద తప్పట్లేదు. పెట్టుబడిదారులు కరోనా ప్రతికూల ప్రభావంతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అమ్మకాల ఒత్తిడి అధికమవుతుండటంతో మార్కెట్లు నష్టాలను మూటగడుతున్నాయి. గురువారం ఉదయం నుంచే నష్టాల బాట పట్టడంతో మార్కెట్లు ముగిసే సమయానికి సూచీలన్నీ డీలా పడ్డాయి. సెన్సెక్స్ 242.37 పాయింట్లు నష్టపోయి 31,443 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 71.85 పాయింట్లు కోల్పోయి 9,199 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ సైతం 203 పాయింట్ల నష్టంతో 19,492 వద్ద ట్రేడయింది.

మార్కెట్లు నష్టాలతో ప్రారంభయ్యాక కాసేపటికీ లాభపడినా, లంచ్ సమయం అనంతరం సూచీలన్నీ దిగజారడంతో మళ్లీ నష్టాల్లోకి జారిపోయాయి. ఫైనాన్షియల్, ఎఫ్ఎమ్‌సీజీ రంగాల సూచీలు భారీ నష్టాలను చూడగా, మిగిలిన రంగాల షేర్లు ఊగిసలాడాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవ్వగా, మిగిలిన సూచీలన్నీ నష్టాల్లో కదలాడాయి. బుధవారం త్రైమాసిక ఫలితాల అనంతరం యెస్ బ్యాంక్ అనూహ్యంగా 6 శాతం లాభపడటం గమనార్హం.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed