ఆరు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో మార్కెట్లు!

by Harish |   ( Updated:2020-06-04 06:23:52.0  )
ఆరు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో మార్కెట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం నుంచి ఊగిసలాటలో కదలాడిన సూచీలు మార్కెట్లు ముగిసే సమయానికి నష్టాలను నమోదు చేశాయి. ట్రేడర్ల లాభాల స్వీకరణకు దిగడంతో పాటు, ఫైనాన్షియర్లు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో మార్కెట్లు నేలచూపులు చూశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసియా మార్కెట్ల ధోరణితో పాటు, ఇటీవల మూడీస్ దేశీయ రంగాలపై స్పందించిన తీరు వల్ల మార్కెట్లు నష్టాలను చూశాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కొన్ని కౌంటర్లలో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో మార్కెట్లు ఊగిసలాటల తర్వాత నష్టాలను చూశాయి. సెన్సెక్స్ ఇండెక్స్ 128.84 పాయింట్లను కోల్పోయి 33,980 వద్ద ముగియగా, నిఫ్టీ 32.45 పాయింట్లు నష్టపోయి 10,029 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఫార్మా, ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, మీడియా రంగాలు లాభాలను నమోదు చేయగా, రియల్టీ, ప్రైవేట్ బ్యాంకులు నష్టాలను చూశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి.

Advertisement

Next Story

Most Viewed