- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పడుకున్న భార్య మీదికి పాములను వదిలి హత్య.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
దిశ, వెబ్‌డెస్క్: గతేడాది కేరళలో భార్యను పాముతో కాటేయించి చంపిన భర్త కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొల్లాం అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. భార్య మరణానికి కారణమైన భర్తకు కోర్టు రెండుసార్లు జీవితఖైదు శిక్షలను విధించింది. అంతేకాకుండా రూ. 5 లక్షల జరిమానా విధించింది.
వివరాలలోకి వెళితే.. కేరళకు చెందిన సూరజ్ కి, ఉత్తర అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఎటువంటి కలతలు లేని వీరి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. భార్యను మరిచి సూరజ్ మరో యువతి మోజులో పడ్డాడు. ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన అతను ఆమెతో బతకడానికి భార్య ఉత్తర అడ్డుగా ఉందని భావించి ఆమెను ఎలాగైనా అడ్డు తప్పించాలని ప్లాన్ వేశాడు. తన చేతికి మట్టి అంటకుండా భార్యను చంపడానికి యూట్యూబ్ ని వెతికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ని రెడీ చేశాడు. ఇందుకోసం ఒక పాములు పట్టే వ్యక్తి వద్ద విషసర్పాన్ని కొనుగోలు చేసి అర్ధరాత్రి నిద్రపోతున్న భార్యపైకి వదిలాడు.
2020 మార్చిలో జరిగిన ఈ ఘటనలో ఉత్తర ప్రాణాలతో బయటపడినా 52 రోజులు హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి వచ్చింది. ఇంత చేసినా ప్లాన్ బెడిసికొట్టడంతో అదే ప్లాన్ ని మరోసారి అమలుపర్చాడు కిరాతక భర్త. రూ.10 వేలు ఖర్చుపెట్టి మరోసారి పాములు పట్టే వ్యక్తి వద్ద కోబ్రాను కొనుగోలు చేసి భార్యపైకి ఉసిగొల్పాడు. రెండోసారి పాము కాటు వేయడంతో నిద్రస్తున్న భార్య నిద్రలోనే మృతి చెందింది. అందరు పాము కాటువలనే ఉత్తర మృతిచెందిందని నమ్మారు. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం కుమార్తె మరణం సహజంగా జరిగింది కాదని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సూరజ్ గుట్టు బయటపడింది.
సూరజ్ ని అనుమానించి, తమదైన రీతిలో ప్రశ్నించగా షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. తానే భార్యను చంపినట్లు ఒప్పుకోవడంతో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. కొల్లాం అదనపు సెషన్స్ కోర్టు సూరజ్‌ను దోషిగా నిర్ధారించింది. పాముతో కరిపించి హత్య చేసినందుకు పదేళ్లు, సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించినందుకు మరో ఏడేళ్లు కఠిన కారాగార శిక్షను విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీనితో పాటు సూరజ్ కు రూ.5 లక్షల జరిమానా విధించింది. కాగా, కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉత్తర తల్లి మండిపడింది. ఇంత దారుణానికి పాల్పడిన వాడికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు కేరళలో సంచలనాన్ని సృష్టిస్తోంది.