కృష్ణా జలాల జగడం: తెలంగాణ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి

by Anukaran |   ( Updated:2021-06-25 08:10:02.0  )
perni nani
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ మంత్రుల వాదన రాజకీయ అవసరం కోసమేనని ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జలవివాదంపై రెచ్చగొట్టేవ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాలకు ఎలాంటి లాభం ఉండకపోగా ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనేదే సీఎం జగన్ విధానమని చెప్పుకొచ్చారు.

శ్రీశైలం, సాగర్‌లో కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని..చుక్క కూడా అదనంగా తీసుకోవడం లేదని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. కృష్ణా జల వివాదంపై సీఎం కేసీఆర్‌తో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైఎస్ఆర్‌ను తెలంగాణ నేతలు విమర్శించడాన్ని తప్పుబట్టారు. తెలుగు రాష్ట్రాలకు ఇరిగేషన్ పరంగా ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం వైఎస్ఆర్ ఎంతో చేశారని చెప్పుకొచ్చారు. రెచ్చగొట్టి లబ్ధిపొందాలనే ఉద్దేశంతో కొందరు దివంగత సీఎం వైఎస్ఆర్‌ను విమర్శిస్తున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

కేసీఆర్ వ్యవహారం నాకు నచ్చడం లేదు : ఏపీ మినిస్టర్

Advertisement

Next Story