- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎట్టకేలకు రేవంత్‌తో భేటీకి ఆ సీనియర్లు సిద్ధం
దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్ పీఠం కోసం పోటీ పడిన నేతలు ఒక్కొక్కరుగా కలిసి వస్తున్నారు. నిన్నటిదాకా రేవంత్‌ను కలిసేందుకు కూడా ముఖం చాటేసిన నేతలు.. తాజాగా భేటీ అయ్యేందుకు సిద్ధపడ్డారు. మధ్యాహ్నం నుంచి పలువురు నేతలతో సమావేశమవుతున్న రేవంత్… మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డితో సమావేశమయ్యారు. తార్నాకలోని ఆయన నివాసానికి నేరుగా వెళ్లి కలిశారు. అదే విధంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డితో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. సాయంత్రం టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలవనున్నారు.
ఇప్పటివరకు వీరంతా రేవంత్‌రెడ్డికి సమయం ఇవ్వలేదు. వరుసగా పలువురు నేతల ఇండ్లకు వెళ్లి కలుస్తున్న రేవంత్‌రెడ్డి… టీపీసీసీ చీఫ్ కోసం పోటీపడిన నేతలను సైతం కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఉత్తమ్, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వంటి నేతలు సమయం కూడా ఇవ్వలేదు. అందుబాటులో లేమంటూ సమాచారమిచ్చారు. కానీ మంగళవారం పరిణామాలు మారాయి. భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఉత్తమ్‌తో వరుసగా భేటీ అయ్యేందుకు సమయం కుదిరింది.
భట్టితో మల్లు రవి భేటీ
మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ ఎంపీ మల్లు రవి మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులు, రేవంత్‌కు సహాకరించాలంటూ సూచించారు. దాదాపు గంటపాటు భట్టి విక్రమార్క నివాసంలోనే చర్చించారు. అనంతరం సాయంత్రం రేవంత్‌రెడ్డితో భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ ఖరారైంది.