విభేదాలతోనే ఎన్నికలు సృష్టించారు.. వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
V.Hanumantha Rao
X

దిశ, కమలాపూర్: తెలంగాణలో నిస్వార్థమైన పార్టీ ఏదైనా ఉందంటే, అది కాంగ్రెస్ పార్టీనే అని మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మాదన్నపేట గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఈటల, కేసీఆర్ మధ్య ఉన్న విభేదాలతో అర్ధాంతరంగా ఎన్నికలు సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చి మాటనిలబెట్టుకోలేకపోయాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచి కేంద్రం పేదల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు రిపోర్టర్‌పై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని, ఇది ప్రజాస్వామ్యమా? దాదాగిరా? అని మండిపడ్డారు. ధర్మారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చింది, త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని కోరారు.

Advertisement

Next Story