కేసీఆర్‌కు షాక్.. సమ్మెకు దిగుతున్న సీనియర్ డాక్టర్లు

by Shyam |
కేసీఆర్‌కు షాక్.. సమ్మెకు దిగుతున్న సీనియర్ డాక్టర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం సీనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సమ్మె చేపడుతామని తెలంగాణ సీనియర్ డాక్టర్ల అసోసియేషన్ హెచ్చరించింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి విధులను బహిష్కరిస్తామని సమ్మె నోటీసు విడుదల చేశారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన 15శాతం వేతన పెంపును వెంటనే అమల చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కేర్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్సలు పొందేందుకు పడకల సంఖ్య పెంచాలని, చనిపోయిన డాక్టర్లకు రూ.50 లక్షలు, నర్సులకు రూ.25 లక్షలుగా ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను అమలు పరచాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన 10శాతం ఇన్సెంటీవ్‌ను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే విధులు బహిష్కరించి సమ్మె చేపడుతామన్నారు.

Advertisement

Next Story