- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేరళలో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళలో కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా ఆ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్‌ను వీడుతున్నారు. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీసీ చాకో ఆ పార్టీని వీడగా.. తాజాగా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ విజయన్ థామస్ కూడా రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అనీ, రెండు గ్రూపుల మధ్య ఇమడలేకపోతున్నానని ఆరోపించారు. ఈ విషయం చాలామంది సీనియర్ నాయకులు పైకి చెప్పలేకపోతున్నారని.. కొద్దికాలంలో మరికొంతమంది పెద్ద లీడర్లు సైతం కాంగ్రెస్‌ను వీడటం ఖాయమని ఆయన తెలిపారు. తిరువనంతపురంలోని నెమోమ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి దిగాలనుకున్నా కాంగ్రెస్ మాత్రం విజయన్‌కు సీటును కేటాయించకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. ఏప్రిల్ 4న కేరళలో ఎన్నికలు జరగనున్నాయి.